Headlines
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే | Telangana Power Demand: Record Electricity Demand Hits 15,835 MW in August

ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే | Telangana Power Demand: Record Electricity Demand Hits 15,835 MW in August

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయానికి విద్యుత్ మోటార్ల వినియోగం అధికం కావడంతో కరెంట్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు 12న రాష్ట్రంలో గరిష్ఠంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే తేదీన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,787 మెగావాట్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా 5,048 మెగావాట్లు అధికంగా నమోదైంది. సాధారణంగా వేసవిలో కనిపించే స్థాయి డిమాండ్ ఆగస్టులోనే నమోదవుతుండటం విద్యుత్ శాఖకు…

Read Full News
Vishwanath And Sons Twitter Review: విశ్వనాథ్ అండ్ సన్స్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..! | Surya Mamitha baiju vishwanath and sons movie twitter review

Vishwanath And Sons Twitter Review: విశ్వనాథ్ అండ్ సన్స్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..! | Surya Mamitha baiju vishwanath and sons movie twitter review

స్టార్ హీరో సూర్య చివరిగా కరుపు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ సాధించింది. ఇక ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా…

Read Full News
Kamakshi Bhaskarla: అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’ సినిమాతో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం | Kamakshi Bhaskarla Starts New Journey As Female Lead Roles With Agadha Movie, Details Here

Kamakshi Bhaskarla: అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’ సినిమాతో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం | Kamakshi Bhaskarla Starts New Journey As Female Lead Roles With Agadha Movie, Details Here

తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన్న, నివేదా థామస్ వంటి నటీమణులు తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తూ కామాక్షి భాస్కర్ల ‘అగధ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (ఆగస్టు 14న)న థియేటర్లలో…

Read Full News
Telangana: వారెవ్వా.. తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు.. | Telangana Smart Ration Cards to Get 9 Advanced Security Features to Prevent Fake Cards

Telangana: వారెవ్వా.. తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు.. | Telangana Smart Ration Cards to Get 9 Advanced Security Features to Prevent Fake Cards

తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులకు పటిష్ట భద్రతా ప్రమాణాలు కల్పిస్తోంది. నకిలీ కార్డుల తయారీకి అవకాశం లేకుండా, కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించేలా సివిల్ సప్లయ్స్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల్లో ఉపయోగించే భద్రతా విధానాలను స్మార్ట్ రేషన్ కార్డుల్లోనూ అమలు చేస్తున్నారు. మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో కార్డు డిజైన్‌ను రూపొందించారు. కార్డులోని వివరాలను సాధారణంగా చూడటమే కాకుండా.. ప్రత్యేక పరికరాలు,…

Read Full News
ఆకుకూరలు వారానికి ఎన్ని రోజులు తినాలి..? అందరూ తెలియక చేసే తప్పులు ఇవే..

ఆకుకూరలు వారానికి ఎన్ని రోజులు తినాలి..? అందరూ తెలియక చేసే తప్పులు ఇవే..

మన నిత్య జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసినప్పటికీ, చాలామంది వాటిని తినడానికి కాస్త నిరాకరిస్తుంటారు. అయితే మీకు ఆకుకూరలు తినడం పెద్దగా ఇష్టం లేకపోయినా.. వారానికి కనీసం మూడుసార్లు అయినా వాటిని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ స్వరూప్ రాణి సూచిస్తున్నారు. ఆకుకూరల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ప్రోటీన్లు,…

Read Full News
Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam

Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam

కేవలం 12 రోజుల్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ నుంచి రూ.2.45 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. మొదట ఈ-మెయిల్, టెలిగ్రాం యాప్ ద్వారా ఆయనను సంప్రదించిన నిందితులు.. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులమని నమ్మించారు. తమ సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని భారీ లాభాలు వస్తాయని ఎర వేశారు. అధికలాభాలతో వల…

Read Full News
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్! బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. | Bay of Bengal Low Pressure Alert: Heavy to Very Heavy Rainfall Forecast Across Multiple States, Red and Orange Alerts Issued

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడుతున్న నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు 15కు పైగా రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా…

Read Full News
OTT Movie: పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్ | Malayalam Action Thriller Kattalan Movie Is Streaming Now On These OTT Platforms

OTT Movie: పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. IMDBలో టాప్ రేటింగ్ | Malayalam Action Thriller Kattalan Movie Is Streaming Now On These OTT Platforms

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఆగస్టు 14) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. రష్మిక మందన్నా కాక్ టెయిల్ 2, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, అచ్యుత అవతారం.. ఇలా సుమారు 20 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు…

Read Full News
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని సుసంపన్నం చేసే 8 ఐశ్వర్యాలు ఇవే! | Shravana Friday: Ashta Lakshmi Significance – 8 Forms of Goddess Lakshmi and Their Blessings

శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని సుసంపన్నం చేసే 8 ఐశ్వర్యాలు ఇవే! | Shravana Friday: Ashta Lakshmi Significance – 8 Forms of Goddess Lakshmi and Their Blessings

Ashta Lakshmi Significance Telugu: శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు, ఆధ్యాత్మిక సాధనలకు ప్రత్యేకమైన కాలం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో మహిళలు శ్రీమహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ కుటుంబ సౌభాగ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని కోరుకుంటారు. అందుకే శ్రావణ మాసాన్ని లక్ష్మీ ఆరాధనకు అత్యంత విశిష్టమైన మాసంగా భావిస్తారు. ఆగస్టు 14న శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం సందర్భంగా శ్రీమహాలక్ష్మి అష్టస్వరూపాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను తెలుసుకుందాం. అష్టలక్ష్ములు కేవలం ధనాన్ని ప్రసాదించే…

Read Full News
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. పోలీసుల కీలక సూచనలు! | Tirumala Car Theft Accused Arrested: Police Recover iPhones, Cash, Issue Safety Advisory

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. పోలీసుల కీలక సూచనలు! | Tirumala Car Theft Accused Arrested: Police Recover iPhones, Cash, Issue Safety Advisory

తిరుమల శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాలతో తిరుమలలోని పార్కింగ్ ప్రాంతాల్లో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాంబగీచ కార్ పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రుధ్ర శ్యామ్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలోని వివిధ కార్ పార్కింగ్ ప్రాంతాల్లో…

Read Full News