చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాంభగీచ కార్ పార్కింగ్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో బాలాజీ అకాడే (33), కీర్తి రెడ్డి (31), అప్పాషా మానే (65) ఉన్నారు. తిరుమలకు…