Anand Sai: రాయదుర్గం హిట్ అండ్ రన్ కేసు.. ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జైద్ షా ఖాద్రీ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్…